Wednesday, 4 November 2026

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్.

 

 

 

 

 

 

 

ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 7, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పుల్ల మహేందర్ వర్ధంతి సందర్భంగా అయన జ్ఞాపకార్థం వారి తమ్ముడు పుల్ల సంపత్ జమ్మికుంట వాస్తవ్యులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో మధ్యాహ్నం గర్భిణులకు, బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా బాయిజమ్మ సేవా వ్యవస్థాపకులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గం, మానవ సేవే మాధవ సేవ అని తెలుపుతూ ప్రతి మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు ఇగురపు భాస్కర్, ఏనుగు హేమలత, రామ్ చరణ్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా వారు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.