Wednesday, 4 November 2026

ప్రభుత్వ భూమిలో అక్రమ సాగుకు యత్నం

 

 

 

 

 

 

 

 

 

చెట్లు తొలగింపు…. కలెక్టర్ కు గ్రామస్తుని ఫిర్యాదు క్షేత్రస్థాయిలో అధికారుల విచారణ… నలుగురిపై కేసు నమోదు

పల్లె ప్రకృతి వనానికి భూమి కేటాయింపుమానకొండూరు, ఆర్ సి, జనవరి 7 (జనం సాక్షి)మానకొండూరు మండలంఈదులగట్టెపల్లి గ్రామంలో ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాలువ 153 కిలోమీటర్ల నుండి 156 కిలోమీటర్ల వరకు ఎడమ పక్కన గల ఎస్సారెస్పీ ప్రభుత్వ భూమిలో అక్రమ సాగు యత్నానికి గ్రామస్తుని ఫిర్యాదు మేరకు అడ్డుకట్ట పడింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా అర్ధరాత్రి చెట్లను తొలగించి చదును చేయడం, సాగుకు, ఆక్రమణకు యత్నించడం పై అధికారులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా పల్లె ప్రకృతి వనానికి కేటాయించి ప్రభుత్వ భూమి పరిరక్షణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ ఉదంతం పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాలువ వెంబడి సుమారు ఎకరం భూమిలో ఉన్న తాటి చెట్లను జనవరి ఇరవై న గట్టెపల్లి గ్రామానికి చెందిన తాళ్ల నర్సయ్య, తాళ్ల రాజయ్య, న్యాలం రవీందర్, న్యాలం శంకరయ్య లు న్యాలం శ్రీనివాసుకు చెందిన జెసిబి తో అర్థరాత్రి అక్రమంగా తొలగించారని జిల్లా కలెక్టర్ కు, ఎక్సైజ్ ,ఎస్సారెస్పీ అధికారులకు మీస రాజయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎక్సైజ్, ఎస్సార్ఎస్పీ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అక్రమంగా ఈత చెట్లను తొలగించన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు అందజేయనున్నట్లు తెలిపారు. ఆక్రమనకు గురవుతున్న ప్రభుత్వ భూమిని ఎస్సారెస్పీ అధికారులు డి ఈ సమ్మయ్య ఏ ఈ లు కాళిదాసు , అంజుమ్, వర్క్ ఇన్స్పెక్టర్ నరసింహ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ భూమి పరిరక్షణ చర్యలో భాగంగా ఈదులగట్టెపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి ఎస్ స్వర్ణలత సమక్షంలో ప్రభుత్వ భూమిని పల్లె ప్రకృతి వనానికి కేటాయిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. భూమి అన్యాక్రాంతం కాకుండా వీలైనంత మేర త్వరితగతిన మొక్కలు నాటే చర్యలు ప్రారంభించాలని కార్యదర్శిని అధికారులు కోరారు.