Thursday, 5 November 2026

బెస్ట్ సర్వీస్ సొసైటి నేషనల్ అవార్డును అందుకున్న కొయ్యడ శంకర్

జనం సాక్షి, రామగిరి : బెస్ట్ సర్వీస్ సొసైటర్ నేషనల్ అవార్డు – 2023 సంవత్సరమునకు గాను రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ శంకర్ అందుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 6వ నేషనల్ కాన్ఫరెన్స్, బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డా॥ యు.సుబ్రమనియన్ చేతుల మీదుగా అవార్డును శంకర్ అందుకున్నారు. నేషనల్ఇంటిగ్రేషన్ యూత్ క్యాంపు పెద్దపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చాలా సామజిక, హెల్త్ క్యాంప్స్, కరోనా టైం లో హెల్పింగ్స్, ఇతర రాష్ట్రాలలో సైతం క్యాంప్స్ లో కొయ్యడ శంకర్ పాల్గొని అనేక సామాజిక, హెల్త్, కాల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాక బ్లడ్ డొనేషన్ 30 సార్లు ఇచ్చి ప్రాణదాత గా నిలిచారు. ఇటీవల వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో సైతం శంకర్ చోటు సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ… ఎస్.సి., ఎస్.టి., బి.సి, మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి
ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, కవులకు, రచయితలకు, స్వచ్చంద
సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు. సౌతిండియాలోని 6 రాష్ట్రాలైన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పురిచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 నుంచి డెలిగెల్స్ ఈ కాన్ఫరెన్స్ హాజరైనారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరి జి. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు యం.యం. గౌతమ్, బాదె వెంకటేశం, ముక్కెర సంపత్ కుమార్, అటికంటి అయిలయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, గంగాదేవి రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.