Thursday, 5 November 2026

మనోహర్ రెడ్డిని సన్మానించిన జడ్పీ చైర్మన్

జనంసాక్షి , మంథని : కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ పర్మినెంట్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాడి మహేష్‌లు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంథని పట్టణంలోని రాజగృహా లో వారు జెడ్పీ చైర్మన్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన బయ్యపు మనోహర్‌ రెడ్డి, దాడి మహేష్‌లను పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు.