Friday, 6 November 2026

బైంసాలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు…

 

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ మార్చ్ 16 జనం సాక్షి

 

ప్రజల్లో భధ్రతపై భరోసా కల్పించేందుకే ఆర్ఏఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయని భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం భైంసాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పీఎస్ నుంచి కిసాన్ గల్లీ, కుంట ఏరియా, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మీదుగా కవాతు కొనసాగింది. వజ్రా వాహానం వెనుక బలగాలు అత్యాధునిక ఆయుదాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లర్లను నివారించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఇందులో ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండర్ శ్రీకాంత్, యాదయ్య, పట్టణ సీఐ ఎల్ శ్రీను, ఎస్సైలు హాన్మాండ్లు, శివ, గౌస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి.