Friday, 6 November 2026

ముత్తారంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన వైస్ ఎంపీపీ రవీందర్ రావు

ముత్తారం జనంసాక్షి /మండల కేంద్రంలోని కుమ్మరిపల్లె గ్రామంలో పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ చోరువతో ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనులను గురువారం రోజున ముత్తారం మండల వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సర్పంచ్ తూటి రజిత రఫీ,కలసి కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండారం ఉప సర్పంచ్ దేవునూరి సతీష్, బి ఆర్ ఎస్ పార్టీ బి సి సేల్ మండల అధ్యక్షుడు చల్ల సమ్మయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు అలువోజు రవీందర్, యూత్ ఉపాధ్యక్షుడు అనవేన శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ,