నవంబర్ 16 జనం సాక్షి, బైంసా రూరల్ బైంసా, బీజేపీ రాష్ట్ర అధిష్టానం అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా కన్వీనర్, జాయింట్ కన్వీనర్లను నియామకాన్ని చేపట్టింది. మంగళవారం సాయం త్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియమించిన అసెంబ్లీ కన్వీనర్ల, జాయింట్ కన్వీనర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కు విడుదల చేశారు. ఇందులో ముథోల్ నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ గా తాడేవార్ సాయినాథ్, జాయింట్ కన్వీనర్ పి.సుమన్ కుమార్ నియమితులయ్యారు. రా త్రి వేళలో పార్టీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి బోస్లే మోహన్రావ్ పాటిల్ అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన తాడేవార్ సాయినాథ్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక లు అందచేశారు. బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కపిల్ సిందే, మున్సిపల్ కౌన్సిలర్ దశరథ్, పార్టీ ప్రతినిధులు మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్ గాలి రవి, దిలీప్ రామకృష్ణ తో పాటు పలువురు సన్మానించిన వారిలో ఉన్నారు
బైంసా రూరల్ బైంసా, బీజేపీ రాష్ట్ర అధిష్టానం అసెంబ్లీ




