బైపాస్ రోడ్డు కు కొత్త వెలుగులు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
కరీంనగర్ బైపాస్ రోడ్డులో బద్దం ఎల్లారెడ్డి విగ్రహం నుండి బొమ్మకల్ ఫ్లై ఓవర్ వరకు స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా 2కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను నగర మేయర్ యాదగిరి సునీల్ రావ్ తో కలసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ , మున్సిపాల్ కమీషనర్ సేవా ఇస్లావత్ , డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి -హరిశంకర్ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్ ,లెక్కల స్వప్న-వేణు ,గందే మాధవి ,బొమ్మకల్ సర్పంచ్ పురామల్ల శ్రీనివాస్ ,ఆకుల ప్రకాష్ ,DE మసూద్ ,స్మార్ సిటీ కాంట్రాక్టర్ హరిక్రిష్ణ తదితరులు ఉన్నారు.