బైరి నరేష్ పై మండిపడ్డ అంబేద్కర్ వాదులు
వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం – అంబేద్కర్ అన్న మాటలివి.
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి అంబేద్కర్ విగ్రహం వద్ద 5వ,వార్డు కౌన్సిలర్ తరాల్ల కార్తీక్,ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాల వేసిన అనంతరం వారు మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ,గత నాలుగు రోజుల క్రితం డా.బీ.ఆర్ అంబేద్కర్ సభ లో హిందూ మతంను అయ్యప్పస్వామి వారిని కించపరిచే విధంగా మాట్లాడిన బైరి నరేష్, అనే వ్యక్తి ని కఠినంగా శిక్షించాలని, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు తరాల్ల కార్తిక్ మాట్లాడటం జరిగింది.తదనంతరం ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు మాట్లాడుతూ,ఒక అంబేద్కర్ ముసుగులో ఉండి రాజ్యాంగం కల్పించిన, “మత స్వేచ్ఛ హక్కు పై” విరుద్దగా మాట్లాడటం సరికాదని కులాలను మతాలను ఎవ్వరు వ్యతిరేకించిన సహించేది లేదన్నారు.భిన్నత్వంలో ఏకత్వం గా ఉన్న మన దేశంలో ఏ కులాన్ని అయిన మతాన్ని అయిన కించపరిచే విధంగా మాట్లాడే వారికి ప్రభుత్వం వారికి తప్పకుండా శిక్షపడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షుడు ఆనంతుల లక్ష్మణ్, అవునూరి శ్రీకాంత్,కాడారి గంగాధర్,పలిగిరి లచ్చన్న, మోలుగురి రాజన్న,సురేష్,వెలుగు గంగాధర్, కాంతయ్య, జంజరికని శ్రీను,శేఖర్,భారత్,కళ్యాణ్, రాజు, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.




