Saturday, 7 November 2026

బై0సా ఏరియా ఆసుపత్రిలో రికార్డు

బై0సా ఏరియా ఆసుపత్రిలో రికార్డు…

భైంసా రూరల్ డిసెంబర్ 20 జనం సాక్షి

 

– ఒకే రోజు 15 డెలివరీలు చేసిన డాక్టర్ సురేందర్.

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సోమవారం డాక్టర్ సురేందర్ 15 కాన్పులు చేసి రికార్డు సృష్టించారు. అందులో నాలుగు మొదటికాన్పులు నార్మల్ వి కాగా, మిగతా 11 సెకండ్ కాన్పులుగా తెలిసింది. కాన్పులకై వచ్చిన కుటుంబ సభ్యులు పలువురు డెలివరీ నిమిత్తం నర్సులు రత్నమాల,సువర్ణ,ప్రభులతా,సునంద,ఆస్పత్రి సిబ్బంది సురేశ్ సేవలను సైతం కొనియాడుతున్నారు.