Tuesday, 3 November 2026

బొగ్గుల రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆర్థిక సహాయం

 

 

 

 

ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్ 28.ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంకు చెందిన బొగ్గుల నరసయ్య కుమారుడు బొగ్గుల రామకృష్ణ ఇటీవల చెట్టు మీద నుండి పడి తీవ్ర గాయాలపాలై హనుమకొండలోని ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. బొగ్గుల రామకృష్ణను పరామర్శించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, యువ నేతాజీ ఫౌండేషన్ ప్రధాన సభ్యులు గజ్జెల సుమన్ దాతల సహకారంతో సేకరించిన 4000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్ కుమార్ కానిస్టేబుల్ కన్నేరాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్, గజ్జెల సాంబయ్య, బండపల్లి సంతోష్, కమలాకర్, పృథ్వి, రాము తదితరులు పాల్గొన్నారు.