పాట్నా: బొగ్గు క్షేత్రాల కేటాయింపు అంశంపై పార్లమెంట్‌ను స్తంభింప చేసిన భాజపాపై కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సిధియా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. భాజపా అగ్రనేతలు నితిన్‌గడ్కరీ, సుష్మాస్వరాబ్, నరేంద్రమోడీ సన్నిహితులకు కూడా బొగ్గు క్షేత్రాలు కేటాయించారని తెలిపారు. భాజపా నేతల వైఖరి ప్రవర్తనకు మధ్య చాలా అగాధం ఉన్న విషయం ఈ కేటాయింపుల ద్వారా తెలుస్తోందన్నారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ఎన్డీఏ చేపట్టిన విధానాన్నే యూపీఏ అనుసరించిందని చెప్పారు. ధరఖాస్తు చేసుకొన్న సంస్థలకు బొగ్గు క్షేత్రాలను కేటాయించిందని తెలిపారు. బొగ్గు కేటాయింపులకు సంబంధించి కాగ్ లెక్కలు సరికాదన్నారు. ప్రస్తుతం ఈ కేటాయింపులపై సీబీఐ విచారణ చేపట్టిందని ఇందులో అక్రమాలు జరిగినట్లు ఆ సంస్థ గుర్తిస్తే బాధ్యలు, ప్రయోజనం పొందిన సంస్థలను చట్టం ముండు నిలబెడుతుందని చెప్పారు.




