Wednesday, 4 November 2026

బొగ్గు గనుల్లో వరద నీరు చేరి 8 మంది మృతి

చైనా: చైనాలోని హంగ్‌టాంగ్‌లో బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు. జిందా కోల్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కార్మికులు విధుల్లో ఉండగా బుధవారం నాడు వరద నీరు చేరడంతో వారు గనుల్లో ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శనివారం ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసారు. ఈ ప్రమాదం నుంచి నలుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. వారు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *