హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో బొత్సకు కార్మికుల సమస్యలను ఈయూ. టీఎంయూ నేతలు వివరించారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెళ్తామని , సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని వారు స్పష్టం చేశారు.




