డోర్నకల్ జూన్/ 7/ జనం సాక్షి న్యూస్: గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో, గ్రామంలో పశు సంపద పాడి పంటలతో పచ్చగా ఉండి గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలు ప్రతిష్టాపించడం జరుగుతుందని గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హున్యతండా గ్రామ పరిధిలోని బోడహట్యా తండాలో బుధవారం శ్రీశ్రీశ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ప్రతిని అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీపాద సంతోష్ కృపాకచార్యులు బృందంచే శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయ ఎదురుగా యాగశాలలో గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా హోమం,కుంకుమ అర్చన మహిళలందరూ పాల్గొన్నారు.సాయంత్రం పూట శ్రీ సీతారాముల స్వామి, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు డిజె సప్పట్లు, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.నేడు బొడ్రాయి, శ్రీ సీతారామ స్వామి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ,ధ్వజస్తంభప్రతిష్టనిర్వహించబడుతుంది. బొడ్రాయి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి ఆలయ కమిటీ సభ్యులు,ఉప సర్పంచ్ బోడ రమేష్,భూక్యా నవీన్, బోడ రమేష్, బర్మావత్ రాము, బోడ రాందాస్, బోడా నంద, భూక్యా రవికుమార్, భూక్యా రాజేందర్, ధరావత్ సీతారాం, బోడ మోహన్, బోడ రమేష్, బోడ దాసు, భూక్యా రాము గ్రామ పెద్దలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
బోడహట్యా తండాలో బొడ్రాయి మహోత్సవ వేడుకలు




