మల్లాపూర్ జూన్ జనం సాక్షి మండలంలోని సాతారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం స్నానాల గదులను ఒక లక్ష 60 వేల తో నిర్మించిన దాత సుద్దాల నరేష్ హరిప్రియ దంపతులు వారి కుమారుడు అభిరామ్ అభివర్ణ లను మంగళవారం రాత్రి గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మిక చైర్మన్ పోతవేణి కిషన్ గౌడ్ , వైస్ చైర్మన్ బడే రాజేందర్ లు గీత కార్మిక సభ్యులు వారిని పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే ఎంపీ ఫండ్స్ నుండి కళ్యాణ మండపానికిని ఐదు లక్షల తో పనులను చేసినందున ఎంపిటిసి గున్నాల శ్రీనివాస్ నాగలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసరు. ఈ సందర్భంగా ఎంపిటిసి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి త నవంతు అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వస్తానని అన్నారు. ఆలయ నికి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 20000 నగదు పోతవేణి రామాగౌడ్ సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గుర్రాల శ్రీనివాస్ గౌడ్, గీతా కార్మిక కార్యవర్గ సభ్యులు ఊడుగుల శేఖర్ పోతవేణి చిన్నరాజ గౌడ్ ,పోతావే నీ తుక్క గౌడ్, ఉడుముల గంగారాజం, పందిరి ధ
రేణుక ఎల్లమ్మ ఆలయ ని అభివృద్ధి చేసిన దాతలకు ఘన సన్మానం.




