Wednesday, 4 November 2026

బోడు జడ్పీహెచ్ఎస్ నందు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, ఫిబ్రవరి 12( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన ( 1989-90) 10వ తరగతి మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం జరుపుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 1989-90 అప్పటి ప్రధానోపాధ్యాయులు సామినేని సత్యనారాయణ దంపతులను, అప్పటి పేరెంట్స్ కమిటీ టీచర్స్ అయిన అన్నారపు వెంకటేశ్వర్లు,తేరాల రాజేశ్వరరావులను ఘనంగా సన్మానించి అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి విద్యార్థులు,తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నరేంద్ర చారి, నాగేశ్వరావు, రామస్వామి, వీరభద్రం, గోవింద్, లక్ష్మీబాయి, గ్రామస్తులు లక్ష్మీనారాయణ,సాంబయ్య, ముత్తయ్య, రాజలింగం, శ్రీను,సూరయ్య, నరసింహారావు, స్రవంతి, భాగ్యలక్ష్మి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.