బోధన ఫీజులు చెల్లించాలంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో దీక్ష

విజయవాడ: బీసీలతో పాటు అర్హులైన అందరు విద్యార్థులకు బోధన ఫీజులు చెల్లించాలంటూ విజయవాడలో తెలుగు యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అర్హులైన అందరికీ పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని ఎన్నికల్లో గెలిచి, ప్రస్తుతం ఆ పథకాన్ని అస్తవ్యస్తం చేసి కొందరికే పరిమితం చేయడం దారుణమన్నారు. కిరన్‌సర్కార్‌ స్పందించి విద్యార్థులందరికీ బోధన ఫీజులు చెల్లించాలని నగర అర్బన్‌ అధ్యక్షుడు వల్లభనేని వ్ణంశీమోహన్‌ డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు