బోనాల ఎద్దు గుట్ట పై పాత రాతియుగం సమాధులు.
మన పూర్వీకుల చరిత్రను పట్టి చూపుతున్న ఎద్దుగుట్ట.
“జనం సాక్షి ” ప్రత్యేకం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 5. (జనంసాక్షి). మానవ వికాసం కోసం వేల ఎండ్ల ప్రయాణం. ఆటవిక జీవనం నుంచి నేటి ఆధునిక యుగం దాకా జరిగిన పరిణామాలు గత చరిత్రకు సంబంధించి అనేక ఆడవాళ్లను ప్రకృతి నిక్షిప్తం చేసింది. అవి అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి. అలాంటి పాత రాతి యుగానికి సంబంధించిన మన పూర్వీకులైన ఆదిమానవుల సమాధులను గుర్తించి “జనం సాక్షి ” ప్రత్యేకంగా అందిస్తోంది.
మానేరు నది పరివాహక ప్రాంతంలో మన పూర్వీకులైన ఆదిమానవుల ఆవాసాలను అనేక చరిత్రకారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రాక్ ఆర్ట్స్ తో పాటు డోల్మన్ రాతిగుటి సమాధులు అనేక ప్రాంతాల్లో వేలుగు చూసాయి. పాత రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్లు పెద్దపల్లి జిల్లాలోని తక్కల్లపల్లి తో పాటు అనేకచోట్ల వెలుగు చూసాయి. క్రీస్తుపూర్వం 30 వేల నుండి పదివేల వరకు మధ్యకాలంలో జీవించిన మానవుల జీవన విధానాన్ని ఆనాటి వారి ఆచార వ్యవహారాలను పరిస్థితులను సమాధులు పట్టి చూపుతాయి. మనేరు పరివాహక ప్రాంతానికి సమీపంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ధూరు, బోనాల సరిహద్దులో ఉన్న ఎద్దుగుట్టపై పాతరాతి యుగానికి సంబంధించిన సమాధులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. పెద్ద రాతి గుండ్లను పేర్చి నిర్మించిన సమాధులు గుట్టపై భాగంలో కనిపిస్తాయి. ఆనాటి వాళ్ళ నమ్మకాలకు అనుగుణంగా సమాదుల ముందుభాగం లో తవ్విన రాతి దోనెల్లో కొన్నిట్లో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. గుట్ట పై భాగంలో సుమారు 20 ఎకరాల పైగా విస్తీర్ణంలో అక్కడక్కడ సమాధులు ఉన్నాయి. కొన్ని పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. మరికొన్ని మాత్రం ఆనాటి మన పూర్వీకుల జ్ఞాపకాలను బద్రము చేస్తూ పదిలంగా ఉన్నాయి. పూర్తిగా ఈ సమాధులు ఏ కాలానికి సంబంధించినవి అనేది చరిత్రకారులు నిర్ధారించావలసి ఉంది.




