Thursday, 5 November 2026

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి-అదనపు కలెక్టర్ నటరాజన్.
నెరడిగొండ డిసెంబర్4 (జనంసాక్షి):
18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువతియువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్ అన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ నమోదులో భాగంగా నెరడిగొండ మండల కేంద్రం తోపాటు తేజపూర్ బుద్ధికొండ కుమారి కుఫ్టీ పోలింగ్ బూత్ కేంద్రమును ఆదివారం రోజున ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని18 సంవత్సలు నిండిన యువతి యువకులతో పాటు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదుచేయాలనిపేర్కొన్నారుఓటర్లకు వారి వివరాలలో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓలు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్య వంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండితొలంగించాలని తెలిపారు పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారి అదనపు కలెక్టర్ నటరాజన్ తోపాటు తహిసీల్దార్ పవన్ చంద్ర బూత్ లెవల్ అధికారులు ఆర్ఐ నాగోరావు తదితరులు పాల్గొన్నారు.