బోయిన్ పల్లి ఏప్రిల్ 20 జనం సాక్షి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టి జాతీయ అధ్యక్షలు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73 వ పుట్టిన రోజు బోయిన్ పల్లి మండల కేంద్రం లో తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి జంగం అంజయ్య మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు చేశారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన అవసరం ఇరు రాష్ట్రాలకూ చాలా అవసరం ఉంది . ఆయన సారథ్యంలో మళ్ళీ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాడిషెట్టి జనార్ధన్, కందుల మునిరెడ్డి, కొలువుల శ్రీనివాస్, వినోద్ , గొట్టే రాజు, వీరయ్య, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.




