Thursday, 5 November 2026

బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా నవీన్ 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షిమిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో గల  గల ఇండోర్ స్టేడియంలో మిర్యాలగూడ బ్యాట్మెంటన్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. అనంతరం బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా  నవీన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ప్రముఖ డాక్టర్ అంజయ్య, వైస్ ప్రెసిడెంట్లు గా కే సాయిబాబా, ఎం. సికిందర్, బి మధు, సెక్రటరీగా శ్రీనాథ్ రెడ్డి, అజీముద్దీన్, నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ గా టి లక్ష్మీనారాయణ, మరో 8 మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపిక చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నవీన్ కుమార్ ను క్రీడాకారులు, కోచ్ రామకృష్ణ సన్మానించారు.