హైదరాబాద్: తనపై వస్తున్న ఆరోపణలపై బ్రదర్ అనిల్‌కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ మణికొండ బాధితులు చెప్తుతున్నారని వాస్తవాలు లేకుండా ఎవరూ అలా చెప్పరని వ్యాఖ్యానించారు. త్వరలోనే మణికొండ బాధితులను కలిసి వాస్తవాలు తెలుసుకుంటానని అన్నారు. నీతి నిజాయితీ ఉంటే తనపై వస్తున్నా ఆరోపణలు తప్పని అనిల్ రుజువు చేసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.




