Monday, 2 November 2026

బ్రహ్మోత్సవంలో పాల్గొనడం మా అదృష్టం.

-ఆ దేవుని ఆశీర్వాదం అందరిపైనా ఉండాలి.-ఇక్కడి ప్రజలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలు అవసరం.-అభివృద్ధి చేయడమే మన ప్రధాన లక్ష్యం.-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
కామారెడ్డి/బీర్కూర్ తిమ్మాపూర్ –కన్నుల పండుగ జరిగిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ 8 వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. బుధవారం బాన్స్వాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ లో శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి కుటుంబ సమేతంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూతిమ్మాపూర్ ఆలయానికి మరో 7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరాల జల్లు కురిపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుసమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ముఖ్యంగాసింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించడం జరిగిందన్నారు. అంతేకాకుండాతెలంగాణ ఉద్యమానికి నిజాంసాగర్ కూడా ఒక భాగమే అని కెసిఆర్ అన్నారు.బాన్సువాడ ప్రాంతంలో గతంలో అనేక ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం15 వందల కోట్ల వరి పంట సాగవుతోందని అందుకు ప్రభుత్వం తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు.బాన్సువాడ ప్రజలకు భవిష్యత్ లో  స్పీకర్ పోచారం సేవలు అవసరమని ఆయన కొనేడారు.బాన్సువాడనియోజకవర్గానికి 50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నమని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు “శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి “8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో” భాగంగా “తెలంగాణ తిరుమల దేవస్థానం” (టిటిడి), బీర్కూరు (తిమ్మాపూర్), ” లో ఈరోజు జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు. కుటుంబ సభ్యులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో కలిసి పాల్గొన్న ఆలయ ధర్మకర్త, రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్న రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ లు కేఆర్ సురేష్ రెడ్డి, బిబీ  పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎ జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, శాసనమండలి సభ్యులు విజీ గౌడ, రాజేశ్వరరావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పి బి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు.హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , సతీమణి శోభ, మరియు రాజ్యసభ సభ్యులు జే. సంతోష్ కుమార్,పార్లమెంట్ సభ్యులు బిబీ పాటిల్.బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన శాసన సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి  అలిపిరి వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు.తరువాత దేవాలయం చేరుకున్న ముఖ్యమంత్రి  దాతలు, భక్తులు సమర్పించిన 2 కిలోల స్వర్ణ కీరిటాన్ని స్వామి వారికి సమర్పించారు.అనంతరం కన్నుల పండుగగా జరిగిన “శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి కళ్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు, సభాపతి పోచారం ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు.ఈసందర్భంగాముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం దంపతులు నూతన పట్టు వస్త్రాలతో సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర దేవాలయం తరుపున స్వామి వారి విగ్రహ జ్ఞాపికను ముఖ్యమంత్రి కి స్పీకర్ పోచారం  బహుకరించారు.