Thursday, 5 November 2026

బ్రిడ్జి పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

 

 

 

నెరడిగొండఏప్రిల్24(జనంసాక్షి):బ్రిడ్జి కట్టడం త్వరతిగతిన పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.సోమవారం రోజున మండలంలోని కుంటాల జలపాతనికి వెళ్లే దారిలో రూ. 3.28 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన నిర్మాణ పనులను బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ కాంట్రాక్టును సూచించారు.వీరి వెంట ఎంపిపి రాథోడ్ సజన్ తోపాటు మండల నాయకులు కమల్ సింగ్ మహేందర్ సర్పంచ్లు తదితరులు ఉన్నారు.