రాజంపేట్ ఏప్రిల్ 24 (జనంసాక్షి) రాజంపేట్ మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని సిద్ధుల గుట్టలో ఒక వ్యక్తి శవం ఉందని తెలియగ వెళ్ళి చూడగా రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన గంగు లింగం తండ్రి నారాయణ, వయసు: 50సం: గల వ్యక్తిని, అతని భార్య గంగు లావణ్య మరియు శంకరిగారి గోవిందు అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి లింగంని కత్తితో గొంతు కోసి హత్య చేసి చంపిన అనంతరం ఇద్దరు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు, ఈరోజు ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి నుండి ఒక కత్తి, మోటార్ బైక్, 3 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని నిందుతులని రిమాండ్ నిమిత్తం కామారెడ్డి కోర్టు లో ప్రవేశ పెట్టగా జడ్జి ఇరువురికి 14 రోజులు రిమాండ్ విధించారు, ఇద్దరినీ రిమాండ్ నిమిత్తం నిజామాబాద్ జైల్ కి తరలించారు. ఈ విషయాన్ని భికనూరు సీఐ తిరుపతయ్య, తెలిపారు రాజంపేట్ ఎస్సై రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




