Thursday, 5 November 2026

బ్లీచింగ్ పౌడర్ చల్లించిన సర్పంచ్

బ్లీచింగ్ పౌడర్ చల్లించిన సర్పంచ్

 

మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): మునగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో సర్పంచ్ చింతకాయల ఉపేందర్ మంగళవారం బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. మండల కేంద్రంలోని స్ధానిక గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న వార్డులలో విష జ్వరలు ప్రభలకుండా పలు వార్డులలో మంగళవారం స్థానిక సర్పంచ్ చింతకాయల ఉపేందర్ బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియావంటి విషజ్వరలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లంజపల్లి వెంకయ్య, వార్డు మెంబర్లు రంగమ్మ, సుజాత, ఎల్. శ్రీనివాస్, రాజేష్ గ్రామపంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు