Thursday, 5 November 2026

సూపర్ స్టార్ కృష్ణ మృతికి కొవ్వొత్తులతో నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ మృతికి కొవ్వొత్తులతో నివాళులు

టేకులపల్లి,నవంబర్ 15( జనం సాక్షి ): మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు టిఆర్ఎస్ నాయకులు, యువకులు, పిల్లలు సూపర్ స్టార్,మాజీ ఎంపీ కృష్ణ మృతికి సంతాప సూచకంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
మాజీ ఎంపీ,ప్రముఖ కధానాయకుడు,తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కలర్ సినిమాను పరిచయం చేసిన నటుడు,తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ధ్రువతారగా వెలుగొంది రికార్డు స్థాయిలో 340పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సాధించిన (సూపర్ స్టార్ కృష్ణ) ఘట్టమనేని శివరామకృష్ణ మృతి బాధాకరం,దురదృష్టకరం అని టిఆర్ఎస్ నాయకులు ఆంతోటి రాకేష్, కాలే అభినయ్, మాలోతు ప్రసాద్, అజ్మీర రామ్ కిషోర్, అజ్మీర చందు, మాలోతు గాంధీ, బానోతు నాను సంతాపాన్ని తెలిపారు. అనంతరం సెంటర్లో కొవ్వొత్తులతో సంతాపం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.