Wednesday, 4 November 2026

31న సచివాలయం ఎదుట నిరసన

కవాడిగూడ : ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల కింద మంజూరు చేసిన నిధులను దారి మళ్లించి మోసం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 31న సచివాలయం ఎ దుట దళితులు వేసుకున్న కాళ్ల చెప్పులతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తిరగబడాలని దళిత బహుజన పార్టీ జాతీ య అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్‌, మాలమహానాడు గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అర్షల రాజు పిలుపునిచ్చారు. ఆదివారం వారు విలేకురులతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌లో కేటాయించిన నిధుల్లో ఖర్చు చేసిన తరువాత మిగిలిన రూ.7,496 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశా రు. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చుపై ప్రభుత్వం తక్షణమే శ్వేత ప్రభు త్వం విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేత షేక్‌బాషా, గ్రేటర్‌ నాయకులు చేపూరి రాజు, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *