భక్తి శ్రద్దలతో షష్టి మల్లన్న బోనాలు.
నెన్నెల, నవంబర్ 30, (జనంసాక్షి )
మండలంలో బుధవారం షష్టి వారాలు పురస్కరించుకొని మల్లన్న బోనాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మైలారం గ్రామంలోని మల్లన్న గుడి వద్ద మూడు రోజులుగా జాతర జరుగుతుంది. మంగళవారం రాత్రి భక్తులు మేళ తాళలతో, డప్పు చప్పుళ్లతో శోభయాత్ర నిర్వహించి బోనాలు సమర్పించారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి బీమా గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. బుధవారం నాడు భక్తులు తులాబారం తో మొక్కులు తీర్చుకున్నారు. షష్టి వారాల సందర్బంగా పల్లె ప్రజలు మద్య, మాంస హారాలకు దూరంగా ఉండి నియమ నిష్టలతో బోనాలు సమర్పించడం మల్లన్న బోనాలకు ఆనవాయితీ, కాగా బోనాలు సమర్పించే వరకు పాలు, పాల పదార్థాలను కూడా వాడరు. పంటలు సమృద్ధిగా పండి కొత్త వడ్లతో పాయసం చేసి మొక్కుతారు
భక్తి శ్రద్దలతో షష్టి మల్లన్న బోనాలు




