ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు బిచ్కుందకు రాక
ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే
బిచ్కుంద నవంబర్ 30 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్ల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన ఉందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు హన్మంత్ షిండే తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిసెంబర్ మూడవ తేదీన పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, మార్కెట్ యార్డులో గల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం, బిచ్కుంద మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ కేంద్ర ప్రారంభోత్సవం, మద్నూర్ మండలం నుండి నూతన మండలంగా ఏర్పడిన డోంగ్లి మండలం ప్రారంభోత్సవం అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొని డోంగ్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కావున నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు నాల్చర్ రాజు, వెంకట్రావు దేశాయ్, ఖత్గాం హన్మండ్లు, రాంచందర్, కపిల్ పటేల్, దరస్వార్ సురేష్, అసద్ అలీ, శివకుమార్, రాజాగౌడ్, ర్యాల గంగారెడ్డి, మొహ్మదాబాద్ శ్రీనివాస్ మరియు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు బిచ్కుందకు రాక ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే బిచ్కుంద నవంబర్ 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్ల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన ఉందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు హన్మంత్ షిండే తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిసెంబర్ మూడవ తేదీన పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, మార్కెట్ యార్డులో గల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం, బిచ్కుంద మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ కేంద్ర ప్రారంభోత్సవం, మద్నూర్ మండలం నుండి నూతన మండలంగా ఏర్పడిన డోంగ్లి మండలం ప్రారంభోత్సవం అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొని డోంగ్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కావున నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు నాల్చర్ రాజు, వెంకట్రావు దేశాయ్, ఖత్గాం హన్మండ్లు, రాంచందర్, కపిల్ పటేల్, దరస్వార్ సురేష్, అసద్ అలీ, శివకుమార్, రాజాగౌడ్, ర్యాల గంగారెడ్డి, మొహ్మదాబాద్ శ్రీనివాస్ మరియు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




