Tuesday, 3 November 2026

భక్తులతో ఆలయాలు కిటకిట

కరీంనగర్‌, ఆగస్టు 2 : శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం నాడు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామునే గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి పిల్లలు మొదలు పెద్దల వరకు నూతన వస్త్రాలు ధరించి దైవదర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. గోదావరి నది తీరంలోని మంథని ముక్తేశ్వర ఆలయంతో పాటు, కాళేశ్వరంలోని ముక్తేశ్వర, కాళేశ్వరస్వామి, కోటిలింగాల దేవాలయంలోని లింగేశ్వర స్వామిని భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలన్ని కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆలయాలను విద్యుద్ధీపాలంకరణలతో కళ్ళు మిరుమిట్లుకొలేపేలా ఆలయ అధికారులు అలంకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *