Tuesday, 3 November 2026

భగవద్గీతను అనుసరిస్తూ మానవ జీవనం కొనసాగించాలి ఉత్తమ గీత ప్రబోధక్ చిలమంతుల ఛత్రపతి ఆర్యవైశ్య సంఘo అధ్యర్యంలో 15 రోజులపాటు గీత జ్ఞానం

ఖానాపూర్ రూరల్ 4 జులై (జనం సాక్షి): భగవద్గీతను అనుసరిస్తూ మానవ జీవనం కొనసాగించాలి అని ఉత్తమ గీతప్రబోధక్చిలమంతులఛత్రపతిఅన్నారు.మంగళవారం 74 వ గీత జ్ఞాన యజ్ఞం ముగింపు కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రతిరోజు భగవద్గీత లోని శ్లోకాలను చదువుతూ వాటిని జీవనంలో కొనసాగించాలని ఆయన అన్నారు గత 15 రోజులపాటు గీత జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్సంగ్ వారి ఆధ్వర్యంలో 15 రోజులపాటు గీత శ్లోకాలు సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులకు ఉత్సాహాన్ని అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా గీతా శ్లోకాలు కంఠస్థ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. అలాగే 15 రోజులపాటు నిర్వహించిన గీత జ్ఞాన యజ్ఞం నిర్వహించిన చిలమంతుల చత్రపతిని ఆర్యవైశ్య సంఘ నాయకులు ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మహాజన్ జితేందర్,పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళ సంఘ అధ్యక్షురాలు గోలి మాధవి,ప్రధానకార్యదర్శి గీత రాణి,కోశాధికారి చిటికేసి వాసవి,ఉపధ్యక్షురాలు చిన్నవార్ సరిత,రాధిక,నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బండారి విశ్వనాథo,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గన్నారపు రాజేందర్,పట్టణ ఆర్యవైశ్య సంఘము గౌరవ అధ్యక్షుడు మహాజన్ జలందర్ గుప్తా,వాసవి క్లబ్ ప్రధానకార్యదర్శి సామ లక్ష్మినారాయన,కోశాధికారి చిటికేసి సతీష్,వనిత క్లబ్ ప్రధానకార్యదర్శి స్రవంతి,కోశాధికారి వరలక్ష్మి,ఉపధ్యక్షురాలు చోలేటి స్రవంతి,శ్వేత,భక్తులు పాల్గొన్నారు.