
బిచ్కుంద జులై (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల ఇదారాలో హండలు, గంజులు, గంటలతో పాటు అనేక రకాలైన సుమారు 2 లక్షల రూపాయల పైచిలుకు సామాగ్రి దొంగతనంతొ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువకుడు అమ్ముకున్నాడని మంగళవారం నాడు మైనార్టీ యువకులు పోలిస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి శిక్ష విధించి తగిన జరిమానా విధించాలని యువకులు కోరుతున్నారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములకు కూడా నిఘా కరువైందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే హన్మంత్ షిండే కులమతాలకు అతీతంగా కులసంఘాల భవనాలకు లక్షల రూపాయల వ్యయం వెచ్చిస్తోంది. కానీ బిచ్కుందలో నిధులను విడుదల చేయకపోవడంతో యావత్తు బిచ్కుంద మండల ముస్లిం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నాయకుడైతే ఏకంగా అధికార మదంతో డబ్బుల దాహంతో నామమాత్రపు పనులు చేసి వక్ఫ్ బోర్డు డబ్బుల పేరిట లక్షల రూపాయల బిల్లులు సృష్టించి వృధా చేస్తున్నట్లు పక్కా సమాచారం. ఎన్నికల కోడ్ పడే ముందు షాదిఖానా నిర్మాణ పనులు పూర్తి చేస్తే మీకు అనుకూలంగా ఉంటామని స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా కబ్జాలకు గురైన వక్ఫ్ బోర్డు భూములను రికవరీ చేయాలని బిచ్కుంద ముస్లింలు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బిర్యానీ పాయింట్ అహ్మద్, పాషా సేట్, హాఫిజ్ గౌస్, అలావుద్దీన్, జాఫర్, హోండా షోరూమ్ అక్బర్ మరియు భారీ సంఖ్యలో బిచ్కుంద ముస్లిం ప్రజలు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించాలి మైనార్టీ యువకులు




