భజపా ఆర్థిక సాయం
సదాశివ్‌నగర్: మండలంలోని రామారెడ్డి గ్రామంలో ఈనెల 4న విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు లచ్చయ్య కుటుంబానికి శనివారం భాజపా ఆధ్వర్యంలో రూ. 3వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నాయకులు ప్రసాద్ గుప్తా, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.