Wednesday, 4 November 2026

భాజపా జెండా ఆవిష్కరణ

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజీవాడీ చౌరస్తాలో శనివారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బానాల లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ హిందూ సంస్కృతిని పరిరక్షిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీను గెలిపించటానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి , నాయకులు విఠల్‌, నరసింహారెడ్డి , ఆశయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *