Friday, 6 November 2026

భద్రకాళి ఆలయం సందర్శించిన హంపి

భద్రకాళి ఆలయం సందర్శించిన హంపి పీఠాధిశ్వరులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 14(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సోమవారం హంపి పీఠాధిస్వరులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పూర్ణకుంభం చేత స్వాగతం పలికారు. అనంతరం ఆలయం లోని అమ్మవారిని దర్శించుకుని స్వామి వారు పూజలు చేశారు. అంతకుముందు ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతి ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి వారి వెంట మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు న్యాయవాది భగవాన్దాస్ మంతని తదితరులు ఉన్నారు.