Friday, 6 November 2026

బాలల దినోత్సవం సందర్భంగా కస్తూర్భా

బాలల దినోత్సవం సందర్భంగా కస్తూర్భా పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ
కొండమల్లేపల్లి నవంబర్ 14 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా సదగోటి రామకృష్ణ ఆర్థిక సహకారంతో తీసుకున్న క్రీడా సామగ్రిని కొండ మల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి ఎంపీపీ రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది, భారతజాతీయ వాది అయిన మోతిలాల్ నెహ్రూ గారి కుమారుడు పండిట్ జవహరలాల్ నెహ్రుఅని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో న్యాయ శాస్త్రంలో బారిష్టర్ పూర్తి చేశారని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అని భారతరత్న అని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి ప్రధాన మంత్రి అని అత్యధిక కాలం భారతదేశ ప్రధానమంత్రి గా పరిపాలన చేసిన గొప్ప మహనీయులు అని ఆధునిక భారతదేశ రూపశిల్పిగా కీర్తించబడ్డారని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే ఎంతో అమిత ప్రేమ అని తెలిపారు పిల్లలే దేశానికి ఉజ్వల భవిష్యత్తు అని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ను చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారని తెలిపారు పిల్లలు ఎంతో కష్టపడి క్రమశిక్షణతో కలిసి ఉంటే భవిష్యత్ భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తారని కొనియాడారు విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలి అని అన్నారు, ఆ తరువాత విద్యార్థులందరికి బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ మల్లేపల్లి మండల వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు,యువజన కాంగ్రెస్ నాయకులు మంగ్య నాయక్, సద్దగోటి రామకృష్ణ, మహేందర్, కార్తీక ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కో-ఆర్డినేటర్ యం.డి. ఖదీర్, సేవ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.