భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం మేజర్ పంచాయతీని టెంపుల్‌సిటీగా ఏర్పాటు చేయాలని స్థానిక గోల్డ్‌స్మిత్ కాలనీ వాసులు భూక్యా కుమారి, విజయలక్ష్మి, బాణోత్ హారిక, హరిశ్చంద్ర, షాబీర్‌పాషా కోరారు. ఈ మేరకు వీరు రెండ్రోజుల క్రితం మహబూబాబాద్ మండలం నెల్లికుదురులో ఉన్న మంత్రి పోరిక బలరాంనాయక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సీతారామచంద్రస్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. సీతారామచంద్రస్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి భద్రాద్రి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తితిదే అందిస్తానన్న రూ. 10 కోట్లతో ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు.




