ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివారులో మూడేళ్ల బాలుడు హర్షిత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బుకోసం దుండగులు నిన్న తెల్లవారు జామున హర్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు. రూ. 7లక్షలు ఇవ్వాలని లేక పోతే బాలుడ్ని చంపేస్తామని బెదిరించారు. బాధితులు పోలీసుల్ని అశ్రయించడంతో కిడ్నాపర్ల ఓబులక్కపల్లె శివారులో బాలుడి గొంతు నులిమి హతమార్చి గ్రామశివార్లలోనే పాతిపెట్టారు. బాలుడి అపహరణ, హత్య ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




