హైదరాబాద్: సైఫాబాద్ భరోసా సెంటర్‌లో గవర్నింగ్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ భరోసా సెంటర్ నిర్వహణ, బాధితులకు అందుతున్న పోలీస్ సహాయం, వైద్యం, పునరావాసంపై చర్చ సాగిందని తెలిపారు.




