భర్తను వదిలేసిందని గుండుగీయించి వూరేగించారు

, హైదరాబాద్‌: పంచాయతీ పెద్దల |ర్జన్యానికి సంబంధించిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భర్తను వదిలి మరో వ్యక్తితో నివసిస్తున్నందుకు ఓ మహిళకు గుండుగీసి వూరేగించారు సెడం అనే గ్రామ పెద్దలు.స్థానిక సుర్గుజా ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మద్యపానానికి బానిసై వేధిస్తున్న భర్తను వదిలేసి తనని ప్రేమిస్తున్న మరో వ్యక్తితో నివసిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆమె చేతులు కట్టేసి భర్త చేత ఆమెకు గుండు గీయించి వీధుల్లో వూరేగించారు. అనంతరం తమ గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ సంఘబహిష్కరణ చేస్తూ తీర్మానించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి పోలీసు బృందాన్ని పంపినట్లు తెలిపారు. విచారణ చేపడుతున్నామని ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తెలిసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు