కడప: భర్త మరణ వార్తతో ఓ మహిళ తాను కూడా అర్ధంతరంగా తనువు చాలించింది. కడప జిల్లా చిట్వేలు మండలం కేఎస్ అగ్రహారానికి చెందిన రైతు బాలచంద్రారెడ్డి(35) శనివారం ఉదయం పొలంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఇంట్లో ఉన్న భార్య వనజ(30)కు ఈ విషయం తెలిసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె కూడా మృతి చెందారు.




