Monday, 2 November 2026

భర్త వేదింపులు తాలలేక మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

బోయిన్ పల్లి జూన్ 30 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శుక్రవారం రోజున విషాదం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిడ్ మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కోదురుపాక లో శుక్రవారం చోటుచేసుకుంది.
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం కి చెందిన రజిత కరీంనగర్ లోని సుభాష్ నగర్ కి చెందిన మహ్మద్ అలీ నీ ప్రేమ వివాహం చేసుకున్నది.వీరికి ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు)
పిల్లలు ఉన్నారు. శుక్రవారం తల్లి ఇంటికి వెళ్తున్న అని చెప్పి పిల్లలతో సహా బయటకు వచ్చిన రజిత బోయిన్ పల్లి మండలం కోదురుపాక మిడ్ మానేరు బ్రిడ్జి పై నుండి మిడ్ మానేరులోకి ముగ్గురు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుమృతదేహాలను బయటకు తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.