పెనుబల్లి, జూన్ 30(జనం సాక్షి)
పెనుబల్లి ముత్యాలమ్మ తల్లి గుడి అభివృధ్దికి గురువారం దాతలు రూ.10232 వేలు విరాళంగా అందజేశారు. గుడి ఆవరణలో వంట షెడ్డు, భోజనశాల నిర్మాణం, కొరకు దాతలు చల్లా నారాయణరావు స్వరాజ్య లక్ష్మి దంపతులు శ్రీ సాయి కృష్ణ జనరల్ స్టోర్స్ అండ్ కిరాణ వారు రూ. 5116లు విరాళం గా అందించారు. అలాగే లయన్. మిట్టపల్లి జనార్ధన్ జయ శ్రీ దంపతులు ధనప్రియ ఫైనాన్స్ వారు రూ. 5116 లు వారు అందించారు. ఈ సందర్భం గా ముత్యాలమ్మ గుడి అభివృద్ధి లో పాలు పంచుకున్న దాతలకు ఆలయ కమిటీ తర పున వంగా కృష్ణ గౌడ్, వంగ చెన్నారావు గౌడ్, మిద్దె స్వామి, వేముల బాబురావు గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.
పెనుబల్లి ముత్యాలమ్మ గుడి అభివృద్ధికి రూ.10232 వేలు విరాళం.




