Wednesday, 4 November 2026

భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం ను పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం వారి ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కార్మికుల శ్రేయస్సు కోసం లేబర్ కార్డు ఉన్న కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం కార్మికుల కోసం ఏర్పాటు చేయడమైనది, ఇది కార్మికులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. లేబర్ కార్డు రెన్యువల్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ శిబిరాన్ని ప్రతి ఒక్క కార్మికులు వినియోగించుకోవాలన్నారు . తద్వారా జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల కార్మికులు తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు ప్లంబర్ ఎలక్ట్రిషన్, కార్పెంటర్స్, పెయింటర్, భవన నిర్మాణ కూలీలు ,ఈ శిబిరంలో పాల్గొని తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచులు సరిత శ్రీనివాస్, బొల్లిపల్లి శంకర్ ,తాటికొండ శంకర్, బిఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి, కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గుంపుల రవి, లక్ష్మీనారాయణ, దాసరి లింగయ్య, అందే కొమురయ్య, మల్లేష్, వెంకటేష్ తదితర కార్మికుల నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.