జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ సాబీర్ కి రోడ్డు ప్రమాదంలో కాలు పైకి లారీ ఎక్కడంతో, పాదం ముందు బాగం కాలి వేల్ల తో సహా పూర్తిగా పోయినవి. శస్త్ర చికిత్స నిమిత్తం 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన తన ఆర్థిక పరిస్థితి చూసి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులంతా కలిసి జమ చేసిన రూపాయలు 61,000 భాడితునికి అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ మాట్లాడుతూ.. సాబీర్ కి ఆర్థిక సహయం అందించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సాబీర్ కి మరొక శస్త్ర చికిత్స నిమిత్తం 2 లక్షల వరకు ఖర్చు ఉన్నందున వీలైనంత ఆర్థిక సహయం అందించే దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్, ఆసం శ్రీకాంత్,మెడగోని విజయ్,సాయి, మల్యాల రమేష్, విజయ్,నరేష్, రెడ్డి చైతన్య, షాకీర్, మిడివెల్లి రఘు, గోపగాని కుమార్, అఫ్సర్, చిదురాల అజయ్, సలీం,సజ్జు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితునికి హెల్పింగ్ హ్యాండ్స్ సాయం




