Wednesday, 4 November 2026

భవాని శంకర్ దేవాలయంలో భక్తుల పూజలు

భవాని శంకర్ దేవాలయంలో భక్తుల పూజలు

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 07(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ భవాని శంకర దేవాలయం లో పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా  మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మరియు పుష్పార్చన నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకున్నారు తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఆలయ అర్చకులు శివప్రసాద్ తో పాటు మిగతా అర్చకులు భక్తుల పేర అర్చనలు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అదేవిధంగా మహిళలు సాయంత్రం పూట దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.