Wednesday, 4 November 2026

రేపు కందగిరి జాతర

రేపు కందగిరి జాతర

నేడు చంద్రగ్రహణం కారణంగా రద్దు అయిన కందగిరి జాతర

కురవి నవంబర్-7 (జనంసాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ పరిధిలోని కందగిరి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ, వెంకటేశ్వర స్వామి జాతర ప్రతి వేట కార్తీక పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.కానీ ఈ సంవత్సరం 8వ తారీకున చంద్రగ్రహణం రానందున ఆలయం మూసి వేస్తున్నట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు,సిరోల్ ఎస్సై లావుడ్యా నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. జాతరను రేపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు కావున భక్తులు సహకరించగలరని కోరారు.ఈ విషయాన్ని ముందుగానే పరిసర గ్రామాలతో పాటు పలు తండాలలో దండోరాలు వేసి ప్రజలకు తెలియజేస్తున్నట్టు తెలిపారు.