భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం
హెచ్ఎం కె.ఫ్లోరెన్స్
జనం సాక్షి,చెన్నరావు పేట
మండలం లోని ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతి,ప్రవేశిక, రాజ్యాంగం నిర్మాతల ఫోటోలకు పూలమాలలు సమర్పించారు. విద్యార్థులు రాజ్యాంగ మూలసూత్రాలను, ప్రవేశికను, ఆదేశ సూత్రాలను, ప్రాథమిక హక్కులను, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్న అంశాలను చిత్ర రూపంలో ప్రదర్శించారు.భరత్ అనే విద్యార్థి అంబేద్కర్ వేషధారణ చేయగా, సోషల్ స్టడీస్ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఆమంచ రవికుమార్ సారధ్యంలో భారత రాజ్యాంగంపై వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. ఫ్లోరెన్స్ మాట్లాడుతూ భారతీయులందరికీ పవిత్ర గ్రంథం లాంటి రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడు విధిగా తెలుసుకోవాలని, అందలి అంశాలను పాటించాలని, ప్రతి పౌరునికి హక్కుల తో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, వాటిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమణారావు, ఉమారాణి , శ్రీనివాస్,సంతోష్ కుమార్,బాలాజీ రావు, ఉదయ్ కుమార్, సిహెచ్. మాధవి, మమత, రవికుమార్,కె.మాధవి, సుందర్, మురళి, రవీందర్,నీల,క్రాఫ్ట్ టీచర్ఇందిర,జూనియర్ అసిస్టెంట్ జాహెద్ లు పాల్గొన్నారు.




